దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దోహాలో ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మాత్రం రాణించాయి. సెన్సెక్స్ 249 పాయింట్లు కోల్పోయి 76,478.67 వద్ద, నిఫ్టీ 80.50 పాయింట్లు నష్టపోయి 23,865.75 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.66గా ఉంది.