స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్ 246 పాయింట్ల నష్టంతో 82,943 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 60 పాయింట్లు క్షీణించి 25,295 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సూచీలో హెచ్‌యూఎల్, కొటక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, లార్సెన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో మొదలయ్యాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, అపోలో స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.