దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఇండెక్స్‌లో ప్రధాన కంపెనీలైన రిలయన్స్, ఎల్అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రాణించడంలో సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంతో 76,671 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 23,204 వద్ద కదలాడుతోంది. మారుతీ సుజుకీ, జొమాటో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌సీఎల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.