స్టాక్ మార్కెట్.. నాలుగు రోజుల్లో రూ.88,678 కోట్ల లాభాలు!

గత వారం నాలుగు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులు సృష్టించింది. టాప్ 10 విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ రూ.88,678 కోట్లు పెరిగింది. బ్యాంకింగ్ స్టాక్స్, ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ లాభాల్లో దూసుకుపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.12,043.96 కోట్లు పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. అయితే, భారతీ ఎయిర్‌టెల్ రూ.35,615.21 కోట్లు, ఎల్‌ఐసీ రూ.21,188.74 కోట్లు నష్టపోయాయి. ముడి చమురు ధరలు తగ్గడం, పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు పెరగడం మార్కెట్ వృద్ధికి దోహదపడ్డాయని విశ్లేషకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్