లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఐటీ, లోహ రంగాల షేర్లకు మదుపర్ల నుంచి మద్దతు లభించడంతో సెన్సెక్స్ 413 పాయింట్లు లాభపడి 74,729 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,146 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.95గా ఉంది. బంగారం ధర ఔన్సుకు 4,197 డాలర్లుగా ఉంది. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు లాభపడగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, బీఎస్‌ఈ లిమిటెడ్ వంటివి నష్టపోయాయి.

సంబంధిత పోస్ట్

✕
✕