దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్ క్యూ1 ఫలితాల ప్రభావంతో ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 700 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 25,200 దిగువకు చేరింది. నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. ఇంట్రాడేలో 82,442.25 వద్ద కనిష్ఠాన్ని తాకి 689.81 పాయింట్ల నష్టంతో 82,500.47 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. నిఫ్టీ 205.40 పాయింట్ల నష్టంతో 25,149.85 వద్ద ముగిసింది.