స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల నష్టంతో 81,134 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 24,611 వద్ద ఉన్నాయి. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కొటాక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఇన్‌ఫోసిస్, మారుతీ, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.