దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 285.94 పాయింట్ల లాభంతో 81,741.34 వద్ద ముగిసింది. నిఫ్టీ 93.85 పాయింట్ల లాభంతో 24,951.15 వద్ద స్థిరపడింది. JSW స్టీల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, NTPC, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రిలయన్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి.