AP: తెలంగాణ కాంగ్రెస్, BRS నేతలపై TDP ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఈ క్రమంలో రోజుకు 50, 60 టీఎంసీలు గోదావరి వరద నీరు సముద్రంలోకి వెళ్తుంటే TG కాంగ్రెస్, BRS నేతలు ఏం చేస్తున్నారని సోమిరెడ్డి ప్రశ్నించారు. 'BRS నాయకులైనా బిందెలు అడ్డం పెట్టొచ్చు కదా.. కనీసం కాంగ్రెస్ వాళ్ళు చెంబులతో అయినా ఆపండయ్యా. నీరు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారు' అంటూ విమర్శించారు.