‘ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్‌తో ప్రధాని మోదీ

ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీలో యుద్ధాన్ని ఆపి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్‌కు రష్యన్ భాషలోకి అనువదించిన ‘తిరుక్కురళ్’ ప్రతిని బహుమతిగా ఇచ్చారు. రష్యాలో జరిగే 24వ ఇండో-రష్యా వార్షిక సదస్సుకు రావాల్సిందిగా పుతిన్ ఇచ్చిన ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕