తుఫాన్ ప్రభావంతో TGలోని ఖమ్మం, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు చెరువులు, వాగులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి. దీనివల్ల పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏపీలోని ఏలూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కాకినాడ వంటి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.