మురసు తుఫాన్ ఎఫెక్ట్.. TGలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

TG: 'మురసు' తుఫాన్ మంగళవారం అర్ధరాత్రి వరకు తెలంగాణను తాకనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్ జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, నల్గొండ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕