పంజాబ్‌లోని మోగా జిల్లా నిహాల్‌సింగ్ వాలా పట్టణానికి చెందిన మహేంద్ర సింగ్‌కు జాక్‌పాట్ తగిలింది. గురుగ్రామ్ ఆలయంలో పూజలు చేసి తిరిగివస్తూ పత్రాన్ మార్కెట్‌లో ఓ లాటరీ దుకాణంలో ఆయన టికెట్ కొన్నారు. మొదటి బహుమతి తగలడంతో ఆయన రూ.3 కోట్లు గెలుచుకున్నారు. ఏజెంట్ కమిషన్, ఇతర మినహాయింపులు పోగా రూ.1.80 కోట్లకు పైగా మహేంద్ర సింగ్ చేతికి అందనుంది. కాగా, మహేంద్ర సింగ్ జీవనోపాధి కోసం స్టవ్ రిపేర్ దుకాణం నడుపుతుంటారు.