అంబేద్కర్ కోనసీమలో వింత ఆవు.. చూసేందుకు ఎగబడుతున్న జనం (వీడియో)

AP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లక్కవరం గ్రామంలో 12 అంగుళాల ఎత్తు ఉన్న అరుదైన పుంగనూరు జాతి ఆవు అందరినీ ఆకట్టుకుంటోంది. బోణం కాశీ ఇంట్లో జన్మించిన ఈ ఆవుకు 'మహాలక్ష్మి' అని పేరు పెట్టారు. ఈ చిట్టి ఆవు ఇంటి పిల్లలతో, ముఖ్యంగా వర్షినితో కలిసి ఆడుకుంటూ సందడి చేస్తోంది. దీని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పలువురు దీనిని కొనుగోలు చేయడానికి రూ.3 లక్షల వరకు ఆఫర్ చేశారు. అయితే, బోణం కాశీ కుటుంబం ఆ ఆఫర్లను తిరస్కరించి, తమ ఇంటికి వచ్చిన అదృష్టాన్ని డబ్బుతో పోల్చలేమని, ప్రాణం ఉన్నంతవరకు తామే పెంచుకుంటామని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్