ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా బచ్చగావ్‌లో దశాబ్దాలుగా వస్తున్న వింతైన ‘చెప్పుల హోలీ’ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సంప్రదాయంలో భాగంగా గ్రామస్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూనే చెప్పులతో కొట్టుకుంటారు. గ్రామంలోని దుష్టశక్తులు నశించి, సుఖశాంతులు కలగాలని ఈ ఆచారాన్ని పాటిస్తున్నామని స్థానికులు తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.