హిమాచల్‌ప్రదేశ్‌లో ఇద్దరు 75 ఏళ్ల మహిళలు తమ కంటే తక్కువ వయసున్న భర్తలతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. మొదటి కేసులో 59 ఏళ్ల వ్యక్తి, 75 ఏళ్ల మహిళ 1990లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. భర్త భరణం, వసతి, వైద్య ఖర్చులు భరించడానికి అంగీకరించాడు. రెండో కేసులో 75 ఏళ్ల మహిళ, 39 ఏళ్ల భర్తకు ముగ్గురు పిల్లలున్నారు. 2008లో వివాహం చేసుకున్న వీరు 2021 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు తండ్రితోనే ఉంటామని, తల్లిని కలిసేందుకు అనుమతిస్తానని భర్త హామీ ఇచ్చారు.