TG: హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ సమీపంలో రెండు భారీ పాములు ఒకదానికొకటి పెనవేసుకుని కనిపించిన అరుదైన దృశ్యం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. బాల్కనీ నుంచి ఈ దృశ్యాన్ని గమనించిన నివాసితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. జీవశాస్త్ర నిపుణుల ప్రకారం ఇది పాముల సంభోగ (మేటింగ్) ప్రక్రియలో భాగమైన సహజ ప్రవర్తనే. అయితే నివాస ప్రాంతాల్లో ఇలాంటి భారీ సర్పాలు కనిపించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్‌లలో కొందరు “ఇదేదో అపార్ట్‌మెంట్ కాదు, ఏకంగా స్నేక్ పార్క్‌లా ఉంది బాబోయ్!” అంటూ హాస్యాస్పదంగా కామెంట్లు పెడుతున్నారు.