వింత ఆచారం: మగవారు ఆడవారుగా, ఆడవారు మగవారుగా మారి పూజలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వింత ఆచారాలు కొనసాగుతున్నాయి. కొలుకుల గ్రామంలో వివాహ సమయంలో వధువు వరుడిగా, వరుడు వధువుగా అలంకరించుకుని ఇష్టదైవానికి పూజలు చేస్తారు. నాగులుప్పలపాడులో మూడేళ్లకొకసారి జరిగే అంకమ్మ తల్లి జాతరలో, పెళ్లయిన మహిళలు మగవారిగా, పురుషులు మహిళలుగా వేషధారణలు ధరించి మొక్కులు చెల్లించుకుంటారు. తమ పూర్వీకుల కాలం నుంచి వస్తున్నాయని, భక్తితో పాటు లింగ భేదాన్ని గౌరవించడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్