పాకిస్థాన్‌లో రోడ్లు, ట్రాఫిక్ నిబంధనలు సరిగా లేవని, అక్కడ తరచుగా వింత సంఘటనలు జరుగుతుంటాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా, కరాచీలో ఒక బైక్ పై ముగ్గురు మహిళలు, ఆరుగురు పిల్లలతో సహా మొత్తం పది మంది ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ ఫ్యూయల్ ట్యాంక్ పై కూర్చుని నడుపుతున్న ఈ ప్రమాదకరమైన ప్రయాణాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఒకే బైక్ పై ప్రయాణించాల్సిన అవసరం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.