అమెరికాలో వింత వైరస్.. భారత్‌కు అలర్ట్

అమెరికాలో నోరో వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. జీర్ణకోశ వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్ కలుషిత ఆహారం, నీరు లేదా వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా వ్యాపిస్తుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా 1-3 రోజుల్లో కోలుకున్నప్పటికీ, చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి డీహైడ్రేషన్ ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం దీనికి ఆమోదిత వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్‌ భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాప్తి నమోదు కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు

సంబంధిత పోస్ట్