మహిళను కరిచిన వీధికుక్క.. గంట వ్యవధిలో శునకం మృతి

AP: అనకాపల్లి జిల్లా కోట్ని వీధిలో మంగళవారం ఓ మహిళపై వీధి కుక్క దాడి చేసింది. శ్రావణ జ్యోతి అనే మహిళ ఉ.8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. శ్రావణ జ్యోతిపై కుక్క దాడి చేయడంతో నోటికి గాయమైంది. గాయపడిన మహిళను ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అయితే దాడి చేసిన కుక్క గంటల వ్యవధిలో మరణించినట్లు స్థానికులు గుర్తించారు. కుక్క మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్