పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు!

TG: దసరా పండుగ వేళ పాలపిట్టలను పంజరాల్లో బంధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ దళాల అధిపతి (PCCF) వినయ్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దసరా సమయంలో ఆలయాల్లో పాలపిట్టలను ప్రదర్శించకుండా చూడాలని దేవదాయశాఖను కోరారు. అటవీ చట్టం ప్రకారం ఈ పక్షిని బంధించడం లేదా హింసించడం నేరమని, దీనికి జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, మాంజా విక్రయాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕