అల్లు అర్జున్ అరెస్ట్‌పై YS జగన్ స్పందించారు. "సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి, చనిపోయిన మహిళ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఈ ఘటనకు నేరుగా అతడిని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం సమ్మతం కాదు. అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా" అని జగన్ ట్వీట్ చేశారు.