రెండు పిల్లర్ల మధ్య ఇరుక్కున్న విద్యార్థిని తల, తప్పిన ప్రమాదం (వీడియో)

TG: నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినికి పెద్ద ప్రమాదం తప్పింది. అచ్చంపేట మండలంలోని పులిజాల ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సరిత.. పాఠశాల ప్రాంగణంలోని రెండు పిల్లర్ల మధ్యలో విద్యార్థిని తల ఇరుక్కుంది. ఈ క్రమంలో స్కూల్ సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఊరిలో ఉన్న తాపీ మేస్త్రీలు వచ్చి ఒక పిల్లర్‌ను ధ్వంసం చేసి విద్యార్థిని క్షేమంగా బయటకు తీశారు. విద్యార్ధినికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్