TG: హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్సిటీలోని హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి(19) సూసైడ్ చేసుకున్నాడు మృతుడు బీటెక్ మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్న రాజు విక్రమ్ బాబు (19) గుర్తించారు. సెమిస్టర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.