ఒడిషాలోని కటక్‌లో రావెన్‌షా విశ్వవిద్యాలయంలో ఐటీ మూడో సంవత్సరం చదువుతున్న దేబాశ్రితా దాస్ అనే విద్యార్థిని కృత్రిమ మేధతో పనిచేసే ఒక వినూత్న హృదయ రక్షక సాధనాన్ని రూపొందించారు. ఈ మాస్క్ లాంటి పరికరం గుండెపోటు రావడానికి 30 నిమిషాల ముందుగానే రోగిని అప్రమత్తం చేయగలదని ఆమె తెలిపారు. ఈ ఆవిష్కరణ హృద్రోగ సంబంధ అత్యవసర పరిస్థితులను ముందే పసిగట్టి, ప్రాణాలను కాపాడటంలో సహాయపడుతుంది.