TG: హైదరాబాద్ లోని విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్లో ఉన్న సెయింట్ మార్టిన్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి రిజ్వాన్(15) నాలుగవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.