ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో పడి ఒకటో తరగతి విద్యార్థి మోక్షిత్ మృతిచెందారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడ్ని కోల్పోయామని ఆరోపిస్తూ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.