బైక్ ఓవర్‌టేక్ చేయబోయి విద్యార్థి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు కాలేజ్ విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా, మరో టూ-వీలర్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్