TG: గుండెపోటుతో విద్యార్థి మృతి

వనపర్తి (D) గోపాల్‌పేటలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో ఏదుట్ల గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి భరత్‌(14) గుండెపోటుతో మృతి చెందాడు. స్కూల్ ఆవరణలో కూర్చున్న బాలుడు 10 నిమిషాల తర్వాత కుప్పకూలాడు. వనపర్తిలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న భరత్‌ తల్లి అరుణ గుండెలవిసేలా విలపించారు. గతేడాది తన భర్త, ఇటీవల అత్త మృతి చెందారని, ఇప్పుడు కొడుకు కూడా దూరమయ్యాడని కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్