బెట్టింగ్‌కు ఓ విద్యార్థి బలైన ఘటన దుండిగల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన తోటపల్లి శ్రీకాంత్ బీటెక్ చదువుతున్నాడు. బెట్టింగ్‌కు అలవాటు పడి ఓ వ్యక్తి వద్ద రూ.34వేలు అప్పు చేశాడు. వడ్డీ కోసం ఒత్తిడి చేయడంతో కుటుంబ సభ్యులను రూ.10వేలు అడగ్గా.. వారు నిరాకరించారు. అప్పు ఇచ్చిన వాళ్లు అతడి దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, ఫోన్ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురై సోమవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.