విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. అవమానంతో ఆత్మహత్య

యూపీ ఝాన్సీలోని గుర్‌సరాయిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బీఏ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల సదరు యువతి పిడకలు సేకరించడానికి గోశాలకు వెళ్లిన సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆపై ఫోన్‌లో ఆ దృశ్యాలను రికార్డ్ చేసి.. SMలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. అవమానం తట్టుకోలేక విషం తాగి ఆ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕