మంచిర్యాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. బెల్లంపల్లిలోని గురుకుల పాఠశాలలో ఎనిమిది తరగతి విద్యార్థి అయిన చక్రధర్‌ను ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. బట్టలు విప్పి సిగరెట్ తాగాలని వేధించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. సదరు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.