ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని మదర్ థెరిసా స్కూల్ వద్ద బుధవారం ఉదయం స్కూల్‌కు వచ్చిన విద్యార్థినిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. గేటు వద్ద బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లిన ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి.. కొన్ని గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను ఎందుకు కిడ్నాప్ చేశాడనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.