TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదని, కాలేజీలు పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. దాంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో లక్ష 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగులు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ 3 ఏళ్లలో కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని హరీశ్‌రావు మండిపడ్డారు.