అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పరిషత్ స్కూలులో టీచర్‌ను కొట్టి చంపిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరు మైనర్లు కావడంతో అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో సదరు ఉపాధ్యాయుడు వారిని మందలించాడు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే టీచర్ ఛాతీపై బలంగా దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మరణించిన సంగతి తెలిసిందే.