ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం.. తల్లిదండ్రుల వాట్సప్‌కు హాల్‌టికెట్లు

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు హాల్‌టికెట్లను పంపాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, 45 రోజుల నుంచి రెండు నెలల ముందుగానే ఈ హాల్‌టికెట్లను పంపనున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు హాల్‌టికెట్‌లోని తప్పులను ముందే గుర్తించి, కళాశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేసే అవకాశం ఉంటుంది. అధిక శాతం తల్లిదండ్రుల వద్ద స్మార్ట్‌ఫోన్‌లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హాల్‌టికెట్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్షల షెడ్యూల్ వంటి వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయడమే దీని ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్