గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గల్గోటియాస్ యూనివర్సిటీలో విద్యార్థినులు ఒకరిని ఒకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన యూనివర్సిటీలో కలకలం రేపింది. అయితే ఘర్షణకు గల కారణాలు మాత్రం తెలియలేదు. సదరు విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు సమాచారం.