తమకు లెక్కలు బోధించిన గురువు పదవీ విరమణ సందర్భంగా విద్యార్థులు అరుదైన గౌరవం కల్పించారు. ఆయన్ను పల్లకిపై ఉంచి, తమ భుజాలపై మోస్తూ గ్రామ వీధుల్లో ఊరేగించారు. 'మేము చూసిన ప్రత్యక్ష దైవం' అంటూ విద్యార్థులు చూపిన ఈ అభిమానం నెటిజన్లను కదిలిస్తోంది. ఒక టీచర్‌కు లభించే నిజమైన ఆస్తి ఇదేనని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.