ఆకుపై రాజముద్రతో రాజ్యాంగ దినోత్సవానికి విద్యార్థుల నివాళి

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక వినూత్న రీతిలో నివాళులర్పించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు అప్పికొండ మేఘన, గుమ్మడి శశిప్రియ చామదుంప ఆకుపై రాజ్యాంగ దినోత్సవం అనే ఆంగ్ల అక్షరాలు, సింహాలతో కూడిన రాజముద్రను కత్తిరించి తీర్చిదిద్దారు. ఈ సంఘటన విద్యార్థుల సృజనాత్మకతకు, దేశభక్తికి అద్దం పట్టింది.

సంబంధిత పోస్ట్