మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి చదువుకుంటున్నారు. కక్రౌవా గ్రామానికి చెందిన విద్యార్థులకు పాఠశాలకు వెళ్ళడానికి సరైన మార్గం లేకపోవడంతో, 10-15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో, వారు బెట్వా నదిపై నిర్మాణంలో ఉన్న ఆనకట్ట పిల్లర్లపై దూకుతూ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నారు. ప్రాథమిక హక్కు అయిన విద్య కోసం పిల్లలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన దుస్థితి దేశంలో నెలకొందని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.