పరీక్షలో జవాబులు చూపించలేదని.. బాలుడిని కత్తితో పొడిచి చంపిన విద్యార్థులు

మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో దారుణం చోటుచేసుకుంది. పరీక్షలో జవాబులు చూపలేదనే కోపంతో 10వ తరగతి విద్యార్థి రిషి అహిర్వర్‌ను సహ విద్యార్థులు కత్తితో పొడిచి హత్య చేశారు. చివరి పరీక్ష రాసి బయటకు వచ్చిన రిషిని సుమారు ఎనిమిది మంది విద్యార్థులు చుట్టుముట్టి కత్తితో దాడి చేశారు. దీంతో రిషి చేతిపై తీవ్ర గాయం కావడంతో అధిక రక్తస్రావం అయ్యింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్