సగ్గుబియ్యం కేవలం రుచికరమైన ఆహారమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలున్న సూపర్ ఫుడ్. ఇందులో పుష్కలంగా ఉండే కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం ఎముకలను, ప్రోటీన్లు కండరాలను బలపరుస్తాయి. ఐరన్ రక్తహీనతను దూరం చేసి, హిమోగ్లోబిన్ పెంచుతుంది. పొటాషియం నరాల వ్యవస్థను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరానికి చలవ చేసి, నిద్రలేమి, ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మానికి తేమను అందించి, ముడతలు, మొటిమలను తగ్గిస్తుంది. .