స్టంట్‌మాస్టర్ మృతి.. డైరెక్టర్‌పై కేసు నమోదు

తమిళనాడులో హీరో ఆర్య 'వెట్టువం' సినిమా షూటింగ్‌లో ప్రమాదానికి గురై స్టంట్ మాస్టర్ మోహన్‌రాజు(52) మరణించిన విషయం తెలిసిందే. కాగా, నిర్లక్ష్యం వల్లే మోహన్ రాజు మరణించారని ఆరోపిస్తూ మూవీ డైరెక్టర్ పా.రంజిత్, మరికొంత మందిపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నాగపట్నం జిల్లా వేదమావడిలో ఛేజింగ్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాద ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్