ఐఎస్‌ఎస్ వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు ఈనెల 14న భూమికి తిరిగి రానున్నారు. 15న ఐఎస్‌ఎస్‌ను వీడి కాలిఫోర్నియా తీరంలో వారు ల్యాండ్ అయిన వెంటనే వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వారు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూ వాతావరణానికి వారి శరీరాలు అలవాటుపడేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.