భారత అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా జులై 15న భూమికి తిరిగివచ్చే అవకాశం ఉంది. యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఆయన జూన్ 25న ఆయన అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షానికి వెళ్లారు. జూన్ 26న ISSలో చేరిన శుక్లా, ముగ్గురు సహచరులతో కలిసి 17 రోజుల పాటు పరిశోధన చేశారు. వాతావరణం అనుకూలిస్తే జులై 15న మధ్యాహ్నం 3 గంటలకు క్యాలిఫోర్నియా తీరానికి సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగే అవకాశం ఉంది.