వ్యోమనౌకలోకి ప్రవేశించిన శుభాంశు బృందం (వీడియో)

అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి వచ్చేందుకు వీలుగా శుభాంశు బృందం ‘డ్రాగన్’ వ్యోమనౌకలోకి చేరుకుని తమ స్థానాల్లో కూర్చొంది. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4.35 గంటలకు వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో విడిపోనుంది. 21 గంటలపాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది.

సంబంధిత పోస్ట్