శ్రీలంక తీరంలో ఇరాన్ నౌకపై సబ్‌మెరైన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 101 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. ఇరాన్ నౌక నుంచి సంకేతాలు అందడంతో శ్రీలంక నేవీ రంగంలోకి దిగింది. నావికాదళం 30 మందిని సురక్షితంగా రక్షించింది. అయితే, ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.