గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై 20 రోజుల్లో నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్

TG: రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాలు, ఘాట్ల అభివృద్ధిపై చర్చించారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. టెక్నికల్ ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో కమిటీ పర్యటించి 15-20 రోజుల్లో నివేదిక సమర్పించాలని, ఆపై కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి నివేదిక పంపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్