సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావులకు కేబినెట్ హోదా

TG: పాలనా పరమైన వ్యవహారాల్లో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అలాగే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు కేబినెట్ హోదాతో కూడిన పదవిని కట్టబెట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామకృష్ణరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ బెర్త్ కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు సీనియర్లకు అధిష్టానం బుజ్జగింపు చర్యల్లో భాగంగా ఈ పదవులు ఇచ్చినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్